ఓ చెలి , నన్ను ఎందుకిలా ఒంటరివాన్ని చేసి వెళ్లిపోయావు
నువ్వు చేసిన గాయాలు నా గుండె ఫై ఒక పచ్చ బొట్టులా నిలిచిపోయాయి
నువ్వు చేసిన తీపి జ్ఞాపకాలకోసమే నేను వెతుకుతున్నాను
కాని నీ చేదు గుర్తులే నేడు మిగిలిపోయాయి
కన్నిరంటే తెలియని నాకు, ఆ కన్నీరే మిగిల్చావు
భాద అంటే తెలియని నాకు , ఆ భాధలో జీవించడం నేర్పించావు
నువ్వు నాతో లేవని తెలిసి
నువ్వు నాతోడుగా రావని తెలిసి
ఈ హృదయం ఎన్నో ముక్కలుగా నేడు పగిలిపోయింది
నువ్వు నా ప్రేమని ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని
ఏదో ఆశ, ఆ పగిలిన ముక్కలని అతికించే ప్రయత్నం చేస్తుంది
ఈ మనసులో నీపైన ఆశలు ఎన్నో
ఈ గుండెలో నువ్వు చేసిన గాయలేన్నెన్నో
నా ఆశలు అతికించిన ఈ హృదయంలో నువ్వు చేసిన బాసలు మరెన్నో , ఎన్నెన్నో
--
Raaj
No comments:
Post a Comment