వర్షంతో నా కన్నీళ్ళని పంచుకుంటాను
చీకటితో నా ధుఖాన్ని పంచుకుంటాను
ఒంటరితనంతో నా ఆవేదనని పంచుకుంటాను
చివరికి నీ ధరి చేరువేల నీతో నీ సంతోషాన్ని పంచుకుంటాను
నా కళ్ళల్లో నువ్వు సంతోషాన్ని మాత్రమే చూడగలవు
కాని ఆ ముసుగు వెనుకున్న సముద్రం నీకు కనపడదు
నా పెదవుల ఫై తీయని మాటలు మాత్రమే నువ్వు వినగలవు
నువ్వు గాయపరిచిన ఈ హృదయంలో ఎన్ని గాయాలు వున్నాయో నీకు కనపడవు
ఎందుకంటే నువ్వు నన్ను ఓ స్నేహితుడిగా మాత్రమే చూస్తున్నావు
కాని నేను నీలో నా ప్రాణాన్ని చూసుకుంటున్నాను
నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను
--
Raaj
No comments:
Post a Comment